ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నం

నవతెలంగాణ – నెల్లూరు: తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించారు. నెల్లూరులోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యాలయం నుంచి ఆయన వస్తుండగా సుమారు 10 మంది బైక్‌లపై వచ్చి కర్రలతో దాడికి యత్నించారు. వెంటనే తెదేపా కార్యకర్తలు, ఆనం అనుచరులు వారిని అడ్డుకుని ప్రతిఘటించడంతో దుండగులు అక్కడికి నుంచి పరారయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వెంకటరమణారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో వైకాపా ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్‌తో పాటు ఇతర నాయకుల అవినీతిపై వెంకటరమణారెడ్డి ఘాటుగా విమర్శల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దుండగులు దాడికి యత్నించినట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

Spread the love