– మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు
– ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గీయుల పనేనని ఆరోపణ
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు కేటాయిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆదివారం నియోజకవర్గంలో సంచలనం చోటు చేసుకుంది. 8 ఏళ్ల క్రితం ఓ మహిళతో మదన్ లాల్ సన్నిహితంగా ఉన్న ఫోటోలను ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గీయులు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అవి మార్ఫింగ్ ఫొటోలని మదన్ లాల్ తో పాటు ఆయన వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ రావట్లేదని రాములు నాయక్ అనుచరులు ఎప్పటి ఫొటోలనో ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారని మదన్ లాల్ వర్గీయులు మండిపడుతున్నారు. రాములునాయక్ కే టికెట్ వస్తుందని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తూ… తమకీ దుష్ర్పచారం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైరా నియోజకవర్గం బీఅర్ఎస్ ప్రధాన ఆశావహులుగా ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, చంద్రావతి ఉన్నారు.