– తెలంగాణలోనే అతిపెద్ద డ్రైవింగ్ స్కూల్..
– మండేపల్లి డ్రైవింగ్ శిక్షణ తోపాటు మెకానికల్ నాలెడ్జ్ పై అవగాహన
– టైడ్స్ అందించే శిక్షణను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా రవాణా అధికారి కొండల్ రావు, టైడ్స్ ప్రిన్సిపల్ కె.బూవరాఘవన్
నవతెలంగాణ తంగళ్ళపల్లి: అంతర్జాతీయ ప్రమాణాలతో తర్ఫీదు ఇస్తున్న ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని టైడ్స్ ప్రిన్సిపల్ కె.బూవరాఘవన్,జిల్లా రవాణా అధికారి కొండల్ రావు అన్నారు. తంగళ్ళపల్లి మండలంలోని మండేపల్లి లో ఏర్పాటు చేసిన తెలంగాణలోనే అతిపెద్ద డ్రైవింగ్ స్కూల్ లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం లో భాగంగా గురువారం రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.టైడ్స్ ద్వారా ఇప్పటి వరకూ చేపట్టిన, ప్రస్తుతం చేపడుతున్న కార్యకలాపాలు, రహదారి భద్రత లో టైడ్స్ పాత్రను పాత్రికేయులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఇక్కడ డ్రైవింగ్ శిక్షణ తో పాటు మెకానికల్ నాలెడ్జ్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
భారత దేశంలో ఏటా 4లక్షల 50వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదాల్లో ఒక లక్ష 50 వేల మంది మరణాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ మరణాల్లో సగానికి పైగా యువత ఈ ప్రమాదాలకు గురవుతున్నారని వివరించారు.దీని వల్ల ఆ కుటుంబాలు అన్ని విధాలుగా తీరని నష్టం వాటిల్లుతుండడ మే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రతికూలంగా మారిందన్నారు. రోడ్డు భద్రత పై అవగాహన లేకపోవడం, సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్ని జిల్లాలోని డ్రైవర్ లకు శిక్షణ ఇచ్చేందుకు సిరిసిల్ల లోని మండే పల్లి లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు , అశోక్ లే ల్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో రూ.22 కోట్ల రూపాయలతో టైడ్స్ ఏర్పాటు చేసిందన్నారు.
ఐదు ఎకరాల్లో పరిపాలన, వసతి గృహ భవనాలు, 15 ఎకరాల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మించారనీ వివరించారు.నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాజన్న సిరిసిల్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేసిన డ్రైవింగ్ స్కూల్ అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు మీడియా సహకారం కూడా అవసరమన్నారు. ఎల్ఎంవి, హెచ్ఎంవి, హజార్డోస్, హెచ్ఎంవి,& హజార్డోస్, రినివల్ శిక్షణను వరుసగా కాల పరిమితి 21 రోజులు కోర్స్ ఫీ 7080/-, 30 రోజులు కోర్స్ ఫీ 16,520/-, 3 రోజులు కోర్స్ ఫీ 2250/-, 1 రోజు కోర్స్ ఫీ 750/- తో అందిస్తున్నట్లు తెలిపారు.ఔత్సాహికులకు శిక్షణ తో పాటు భోజన వసతినీ కల్పిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకూ వివిధ కోర్సుల్లో 4000 మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చామన్నారు. 350 మందికి ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఇక్కడ డ్రైవింగ్ శిక్షణ పొందిన అభ్యర్థులకు దేశ, విదేశాలలో మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ లో శిక్షణ పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తదితరులు పాల్గొన్నారు.