లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత

– సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి
– ఎన్నికల నిబంధనల మీద సిబ్బందికి అవగాహన కల్పించేలా చర్యల సమీక్షా సమావేశం
నవతెలంగాణ-మియాపూర్‌
లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్ర స్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లను తీసుకో వాల్సిన జాగ్రత్తల గురించి సోమవారం సైబరాబా ద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి, సైబరా బాద్‌ జోనల్‌ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీ ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్ని కలను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతిఒక్క రూ తమ వంతు కృషి చేయాలన్నారు. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పని చేయా లన్నారు. ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలన్నారు.సైబరాబాద్‌ పరిధిలో అవ సరమైన అన్ని చోట్ల చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అక్రమం గా తరలిస్తున్న డబ్బు, మద్యం ముఖ్యంగా ఉచి తాలను పట్టుకోవడానికి అవసరమైన చోట్ల మరి న్ని చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్ని కల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచన లను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాల న్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బం దికి ఎన్నికల నిబంధనల మీద అవగాహనను కల్పించడానికి సిబ్బందితో సమావేశాలను ఏర్పా టు చేసుకోవాలన్నారు. విజిబుల్‌ పోలిసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించి ప్రతి అంశంపై అధి కారులు సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం ఉండాలని సూచించారు. అధికారులు సంబంధిత పోలీస్‌స్టే షన్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలపై పూర్తిగా అవ గాహన ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాల ని సూచించారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయి లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుం టూ విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తుల మీద నిఘా వేసి ఉంచాలని సూచించారు. క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలన్నారు. చెక్‌పోస్ట్‌ల వద్ద పటిష్ట భద్రత ఏ ర్పాటు చేయాలన్నారు. ఇంతకు ముందు ఎలక్షన్స్‌ సమయంలో ఎదురైన సమస్యల పై పూర్తి నిఘా ఉంచాలని, రౌడీ షీటర్స్‌ను, సస్పెక్ట్‌ షీట్‌ ఉన్నవా రిని, హిస్టరీ షీట్‌ ఉన్నవారిని బైండోవర్‌ చేయాల న్నారు. సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండేలా చూడాలని, సమస్యాత్మక ప్రాంతాలను విధిగా పర్యటిస్తూ ఆ ప్రాంతాలపై దృష్టిసారించాలని తెలిపారు. సమావేశంలో సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ ట్రాఫిక్‌ డి. జోయల్‌ డేవీస్‌, మాదాపూర్‌ డీసీపీ డా.జి.వినీత్‌, మేడ్చల్‌ డీసీపీ నితికాపంత్‌, శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి, బాలానగర్‌ డీసీపీ శ్రీనివాసరావు, ఐపీఎస్‌, రాజేంద్రనగర్‌ డీసీ పీ శ్రీనివాస్‌, ఐపీఎస్‌, డీసీపీ కె. ప్రసాద్‌, ఉమెన్‌ చైల్డ్‌ సేఫ్టీ డీసీపీ సృజన కర్ణం, సైబరాబాద్‌ డీసీపీ క్రైమ్స్‌ నర్సింహా కొత్తపల్లి, ఎస్‌బి డీసీపీ సాయిశ్రీ, మేడ్చల్‌ ట్రాఫిక్‌ డీసీపీ డీవీ శ్రీనివాసరావు, మేడ్చల్‌ ఎస్‌ఓటీ డీసీపీ డి. శ్రీనివాస్‌, ఏడీసీపీలు, ఏసీపీలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love