తీర్పుకు వేళాయె

– ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం
– నేడే తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
– ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌
– స్ట్రాంగ్‌ రూమ్‌కు భారీ బందోబస్తు
– టెన్షన్‌లో రాజకీయ పార్టీల అభ్యర్థులు
– ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అలా, జిల్లా ఎస్పీ వినీత్‌
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం ఐదు నియోజకవర్గాల శాసనసభ ఎన్నికలు అభ్యర్థుల గెలుపు ఓటముల తీర్పు ఆదివారం తేలనుంది. ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని అను బోస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఈవీఎంలను భారీ బందోబస్తు నడుమ ఉంచారు. వాటికి మూడంచల భద్రత కల్పించారు. జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డాక్టర్‌ ప్రియాంక అల, జిల్లా ఎస్పీ వినీత్‌లు శనివారం స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. కౌంటింగ్‌ ప్రక్రియ విధులు నిర్వహించే సిబ్బంది ఉదయం 6 గంటలకు కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.
భద్రాది కొత్తగూడెం జిల్లా
110 పినపాక
మొత్తం ఓట్లు 1,98,402, పోలైన ఓట్లు 1,58,978, పోలింగ్‌ బూత్‌లు 244, 18 రౌండ్లు.
111 ఇల్లందు
మొత్తం ఓట్లు 2,19,569, పోలైన ఓట్లు 1,76,840, పోలింగ్‌ బూత్‌లు 241, 18 రౌండ్లు
కొత్తగూడెం
మొత్తం ఓట్లు 2,43,846, పోలైన ఓట్లు 1,86,347, పోలింగ్‌ బూత్‌లు
253, 19 రౌండ్లు
118 అశ్వారావుపేట
మొత్తం ఓట్లు 1,55,961, పోలైన ఓట్లు 1,35,497, పోలింగ్‌ బూత్‌లు 184, 14 రౌండ్లు
119 భద్రాచలం
మొత్తం ఓట్లు 1,48,661, పోలైన ఓట్లు 1,17,447, పోలింగ్‌ బూత్‌లు
176, 13 రౌండ్లు
మొత్తం ఓట్లు 9,66,439, పోలింగ్‌ బూతులు 1,098, పోలైన ఓట్లు 7,75,109, మొత్తం 82 రౌండ్లు.
ప్రతి నియోజకవర్గంలోనూ ఓట్లు లెక్కింపు 14 టేబుల్‌ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్‌కు14 పోలింగ్‌ స్టేషన్‌లు కేటాయించారు. వాటి పర్యవేక్షణకు 18 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో మైక్రో అబ్జర్వర్‌, ఒక కౌంటింగ్‌ సూపర్వైజర్‌, ఒక కౌంటింగ్‌ అసిస్టెంట్‌ను నియ మించారు. ఓట్ల లెక్కింపును వీక్షించేందుకు కళాశాల ఆవరణలో ఎల్‌ఈడి టీవీని ఏర్పాటు చేశారు. పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం, కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్ర వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు పై సిబ్బందికి జిల్లా ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ తగిన సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కౌంటింగ్‌ కేంద్రాన్ని పలు రాజకీయ పార్టీలు సందర్శించారు. ఓట్ల లెక్కింపు విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Spread the love