టిప్పర్ బీభత్సం.. ఆరుగురు మృతి

indian-student-dies-in-road-accident-in-australia

నవతెలంగాణ- హైదరాబాద్: తమిళనాడులో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని చెంగల్‌పట్టులో ఈ రోజు జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. టిప్పర్ లారీ అదుపు తప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ అతివేగంతో రావడంతో వల్లే మూడు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, టిప్పర్ లారీ పాదచారులను కూడా ఢీకొట్టింది. ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు.. గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రి సహా చెంగల్పట్టులోని వివిధ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది అని డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెంగల్‌పట్టులోని పోలీసులు తెలిపారు.

Spread the love