రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వడ దెబ్బ తగలకుండా సూచనలు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాదు నగరంలో పలు కూడళ్లలో ఈ వేసవి కాలంలో ఎం చెయ్యాలో ఎం చేయకూడదో ఫ్లెక్స్ ద్వారా ఏంటిఆర్ చౌరస్తా , పులాంగ్ చౌరస్తా  మునిసిపల్ కార్యాలయం ఎదురుగా ఫ్లెక్స్ ద్వారా తగు సూచనలు ప్రజలకు తెలియజేయడం జరిగిందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజాంబాద్ జిల్లా శాఖ చైర్మన్ బుస ఆంజనేయులు సోమవారం తెలిపారు.ఈ తీవ్రమైన ఎండల నుంచి ప్రతి ఒక్కరు తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తగు సూచనలు పాటించి వడదెబ్బకు గురికావొద్దని ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాదు జిల్లా శాఖ చైర్మన్ బుస్స ఆంజనేయులు తెలియజేసారు.

Spread the love