ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు..

Tirumala Brahmotsavam is over..నవతెలంగాణ – అమరావతి: కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల దివ్యక్షేత్రంలో అక్టోబరు 4 నుంచి జరుగుతున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఇవాళ విజయదశమి రోజున చక్రస్నాన ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు తెరపడింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. తిరుమల వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని వెల్లడించారు. భక్తులకు సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేయడమేనని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశామని, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు.

Spread the love