తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత కలకలం

నవతెలంగాణ – తిరుపతి: తిరుమల-అలిపిరి మొదటి ఘాట్‌ రోడ్డులో చిరుత సంచారం కలకలంరేపింది. కొండపై నుంచి కిందకు దిగే ఘాట్‌ రోడ్డులోని 15వ మలుపు వద్ద భక్తులకు మధ్యాహ్న సమయంలో చిరుత కంట పడింది. వెంటనే టీటీడీ అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం ప్రాంతంలోని ప్రకాష్‌ నగర్‌ ఎన్‌సీసీ క్వార్టర్స్‌ దగ్గర సోమవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో చిరుత సంచరించింది. వర్సిటీ బోధనేతర ఉద్యోగి యుగంధర్‌ ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలో ఆ దృశ్యం నమోదైంది. ఇటీవల వర్సిటీలో చిరుత సంచరిస్తుండటంతో సిబ్బంది, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Spread the love