ప్రతిపక్షాల(కాంగ్రెస్‌) డబ్బు పట్టుకోవడమే లక్ష్యం: తిరుపతన్న

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రతిపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన డబ్బు రవాణాను అడ్డుకోడమే లక్ష్యంగా పనిచేశామని ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న పేర్కొన్నారు. ఇందుకోసం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్‌ఐబీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. కాంగ్రెస్‌కు చెందిన డబ్బు పెద్దమొత్తంలో పట్టుకున్నామని, కామారెడ్డి నియోజకవర్గం కోసం మరో బృందం ఏర్పాటు చేశామని తెలిపారు.

Spread the love