మురుగున్‌ ముత్తు, జెన్నీఫర్‌కు టైటిళ్లు

హైదరాబాద్‌ : జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో తమిళనాడు ప్యాడ్లర్‌ మురుగన్‌ ముత్తు రాజశేఖరన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. గురువారం జరిగిన అండర్‌-17 యూత్‌ బార్సు ఫైనల్లో తమిళనాడుకే చెందిన పిబి అభినంద్‌పై 11-4, 12-10, 11-13, 11-8తో విజయం సాధించాడు. అండర్‌-17 యూత్‌ గర్ల్స్‌ విభాగంలో మహారాష్ట్ర అమ్మాయి జెన్నీఫర్‌ వర్గీస్‌ గెలుపొందింది. ఉత్తరప్రదేశ్‌ ప్యాడ్లర్‌ అవని త్రిపాఠిపై 11-7, 11-6, 12-10తో జెన్నీఫర్‌ వరుస సెట్లలో విజయం సాధించింది. అండర్‌-13 బార్సు విభాగంలో ఆదిత్య దాస్‌ (పశ్చిమ బెంగాల్‌) 11-8, 11-6, 11-4తో దుల్కన్‌ (హర్యానా)పై విజయంతో టైటిల్‌ సాధించాడు.

Spread the love