దక్షిణాదిలో టీకేఎం ‘మాన్‌సూన్‌ క్యాంపెయిన్‌’

బెంగళూరు : తమ వినియోగదారులకు ఇబ్బంది లేని ప్రయాణాన్ని కల్పించడానికి మాన్‌సూన్‌ క్యాంపెయిన్‌ను చేపడుతున్నట్టు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తెలిపింది. ఈ వర్షాకాలంలో 20పాయింట్ల సమగ్ర వాహన ఫిట్‌నెస్‌ తనిఖీ నుంచి ఇంటి వద్దనే సేవలు అందించటం వరకూ విస్తృత శ్రేణీ సేవలు అందించనున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని తమ సర్వీసు సెంటర్లలో ఆకర్షణీయ సర్వీసింగ్‌ ప్యాకేజిలు అందిస్తున్నట్టు పేర్కొంది.

Spread the love