నిరుపేద వైద్య విద్యార్థికి

–  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
హుస్నాబాద్‌ నియోజకవర్గం పొట్లపల్లి గ్రామానికి చెందిన నిరుపేద వైద్య విద్యార్థి (ఎంబీబీఎస్‌) సన్నీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన విద్యార్థిని అభినందించారు. సన్నీ కుటుంబ పరిస్థితి నేపథ్యాన్ని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డీసీసీ కార్యదర్శి మడప యాదవరెడ్డి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో 65శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన సన్నీని అభినందించారు.కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి విద్యార్థి తండ్రి లక్ష్మణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love