దుకాణంలో బెండకాయను చూడగానే.. వాటిని కొనాలనిపిస్తుంది. అయితే బెండకాయలు మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చిన రెండు మూడు రోజుల్లో పాడైపోతుంటాయి. కొన్ని చిట్కాలతో నెలల తరబడి బెండకాయను నిల్వ చేయవచ్చు. అవేంటో చూద్దాం.
బెండకాయ కొనేటప్పుడు అవి మరీ గట్టిగా ఉంటే త్వరగా పాడైపోతాయి. అందుకని ఫ్రెష్‌గా, కొద్దిగా మెత్తగా ఉన్నవి తీసుకోవాలి. ఎక్కువ విత్తనాలు ఉండకుండా జాగ్రత్త వహించండి. ఇంటికి తెచ్చిన తర్వాత బెండకాయను కడగడం చాలా ముఖ్యం. వాటిని నిల్వ చేసే ముందు శుభ్రంగా కడగాలి. దీని కోసం నీటిలో ఒక చెంచా వెనిగర్ వేసి బాగా కలపాలి. అప్పుడు ఈ నీటిలో బెండకాయలు వేయండి. 10 నిమిషాల తర్వాత, నీటి నుండి వాటిని తీసివేసి, కాటన్ క్లాత్‌లో తుడవాలి.
వీటిని గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టి ఫ్రీజర్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల అవి చెడిపోకుండా తాజాగా ఉంటాయి.