మాంసం, చేపలు, గుడ్లు, పౌల్ట్రీ వంటి అన్ని జంతు ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించాలి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్యాకేజీ చేసిన ఆహారాలు సాధారణంగా కొవ్వు లతో నిండి వుంటాయి. ఇంట్లో తయారు చేసిన ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది.
అధిక ఉప్పు తీసుకో వడం వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. రోజుకు ఆరు గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తిన కూడదు. ఉప్పుకు బదులు మిరియాలు, జీరా పౌడర్, మిరప, నిమ్మరసం వంటివి వాడవచ్చు. రొట్టెలు తినవచ్చు. రెడీగా వుండే మాంసాహారం ఉప్పుతో నిండి వుంటుంది కనుక మానుకోవడమే మంచిది.
కాఫీ రక్తపోటును పెంచుతుంది. కాఫీ ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ, రక్తపోటు ఉన్న రోగిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కాఫీ తాగితే పర్వాలేదు. కానీ రోజూవారీ అలవాటుగా ఉంటేనే సమస్యలు.
ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలను చేర్చండి. తద్వారా రక్తపోటు తగ్గుతుంది.
ఆహారంలో గోధుమలు, ధాన్యాలు వంటివి చేర్చుకోవాలి. వీటిల్లో ఉండే ఫైబర్ ఆర్టియరీలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. రక్తాన్ని మరింత ద్రవంగా, కొవ్వును చాలా నెమ్మదిగా రక్త ప్రవాహంలోకి విడుదల చేయడం ద్వారా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది.
సూర్యరశ్మి నుండి తగినంత విటమిన్ డి, పాలు, తణధాన్యాలు, పెరుగు మొదలైన బలవర్థకమైన ఆహారాలను తీసుకోవాలి.
చేపలు, అవిసె గింజల వంటి మంచి కొవ్వులను ఎన్నుకుంటే , బరువు నియంత్రణలో ఉంటుంది.