– గవర్నర్ ప్రత్యేక పూజలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సోమవారం రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో గణనాథుడికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆమె వినాయచ చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించాలనీ, దేశంలో, రాష్ట్రంలో శాంతి నెలకొనెలా చూడాలని గణేష్‌ను కోరారు. ప్రగతి, అభివృద్ధి సాధించేందుకు ఉన్న అన్ని అడ్డంకులనూ తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి కె సురేంద్ర మోహన్ ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.