– రేపు చెన్నైకి ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏబీపీ నెట్వర్క్ నిర్వహించే సదరన్ రైసింగ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు గురువారం చెన్నైకి ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు ? అనే అంశంపై చర్చలో ఆమె తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. చర్చావేదికలో కవితతో పాటు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై పాల్గొననున్నారు. గురువారం రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి జరిగే చర్చావేదికను నిర్వహించనున్నారు. వేదికకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.