– స్పెషలిస్ట్ బోధనా వైద్యులను తరలించొద్దు
– లేకపోతే నిరవధిక సమ్మె తప్పదు : టీటీజీడీఏ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు స్పెషలిస్ట్ బోధనా వైద్యులను తరలించొద్దని తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం (టీటీజీడీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం సెక్రెటరీ జనరల్ డాక్టర్ కిరణ్ మాదల శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరి ంచారు. గ్రామస్థాయిలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు వైద్యుల నియా మకాలు, పట్టణ ప్రాంతాల్లోని వైద్య నిపుణుల ద్వారా టెలీ మెడిసిన్ సేవలు వినియోగించుకోవచ్చని సూచించారు. ఇప్పటికే డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ సిస్టమ్ రూపంలో వైద్య కళాశాల వైద్యులు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. దానికి అదనంగా వైద్య కళాశాలలో ఫ్యాకల్టీని గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా ఉపయోగించడం వల్ల ఒకవైపు వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న నూతన వైద్య కళాశాలకు ఇది అదనపు భారంతో పాటు జాతీయ వైద్య కమీషన్‌కు అవసరమైన కనీస హాజరు శాతం కరువై ఇవి వైద్య కళాశాలల మనుగడకే కష్టం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో తరలింపు నిర్ణయాలు వ్యవస్థకు ఎంత మాత్రం ఉపయో గపడవని స్పష్టం చేశారు. ఇలాంటి విధానం దేశంలో మరెక్కడా అమలులో లేదని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని కోరారు.