నాణ్యమైన అధిక దిగుబడులను ఇచ్చే సన్న రకాల విత్తనాలను ఉత్పత్తి చేయాలి

– డాక్టర్ కేశవులు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్

నవతెలంగాణ – గోవిందరావుపేట
నాణ్యమైన అధిక దిగుబడులను ఇచ్చే సన్న రకాల విత్తనాలను రైతులు ఉత్పత్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేశవులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో స్థానిక విత్తన ఉత్పత్తి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కేశవులు హాజరై మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగానికి ఆధునిక పద్ధతిలో మేలైన అధిక దిగుబడును ఇచ్చే విత్తనాలను అందించాలని సంస్థ కృత నిశ్చయంతో ముందుకు సాగుతుందని అన్నారు. ప్రజలకు వినియోగంలో ఉన్న సన్న రకాలను మేలైన వాటిని రైతులు ఉత్పత్తి చేసి విత్తన ఉత్పత్తి రైతులు సంస్థ ద్వారా అందించాలని అన్నారు. మెలు అయినా సన్న రకం వరి వంగడాల ఉత్పత్తి ఆధునిక పద్ధతులను డాక్టర్ కేశవులు రైతులకు వివరించి ఉదాహరించారు. మండలంలోని విత్తన ఉత్పత్తి రైతులు ఎంతో అనుభవ ప్రావీణ్యం కలవారని ఆధునిక అనుభవాన్ని జోడించి మరింత మేలైన వంగడాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. అందుకు అనుగుణంగా విత్తనోత్పత్తి రైతులు ఐక్యంగా కలిసి రావాలని సూచించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వితనోత్పత్తి సంస్థ మండల కేంద్రంలోని ఆవరణలో మొక్కలను నాటారు అంతేకాక విత్తనోత్పత్తి రైతులతో కూడా డాక్టర్ కేశవులు మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ మేనేజర్ సంధ్యారాణి మార్కెటింగ్ మేనేజర్ ఎం ఆదినారాయణ రెడ్డి వరంగల్ రీజియన్ మేనేజర్ రఘు ఫీల్డ్ ఆఫీసర్ బిక్షపతి కార్యాలయ సిబ్బంది శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love