రేషన్ షాపుల తనకి..

నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : నల్లగొండ ఎన్ ఫోర్స్ టీం, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలోని 40 రేషన్ షాప్ లను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ రేషన్ డీలర్లు కార్డుదరుల నుండి బియ్యం కొనుగోలు చేసినట్లు తేలితే వారికి గుర్తింపును రద్దు చేసి అదేవిధంగా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.కార్డుదారులు కూడా విధిగా రేషన్ బియ్యన్ని విక్రయించినట్లయితే వారి పైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేషన్ డీలర్లు సమయానికి అనుగుణంగా రేషన్ షాపులను తెరిచి ఉంచాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా బియ్యం సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఫోర్స్మెంట్ టీం అధికారులు  దీపక్,జావిద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు,  తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై  టాస్క్ఫోర్స్ టీం అధికారులు  అంజయ్య , చారి,  పుల్లయ్య, లింగస్వామి  పాషా,  పాల్గొన్నారు.
Spread the love