నవతెలంగాణ – అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ వెళ్లి గురువారం కన్నుమూసిన కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. ఇవాళ రాత్రి అక్కడే బస చేసి, రేపు ఉదయం హైదరాబాద్ తిరిగి రానున్నారు. కాసేపట్లో ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు.