నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కీలక సమావేశం

నవతెలంగాణ-హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు భార్యాసమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన తిరుమల నుంచి అమరాతిలోని తన నివాసానికి బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్లమెంట్ వేదికగా వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే విషయంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. వాస్తవానికి ఈ సమావేశం 3వ తేదీని నిర్వహించాలను తొలుత నిర్ణయించారు. అయితే, 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో సమావేశాన్ని ఒక రోజు ముందుకు జరిపారు.

Spread the love