నవతెలంగాణ – హైదరాబాద్: FY25కిగాను రాష్ట్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం గం.9కి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం పొందుతుంది. అనంతరం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. బడ్జెట్ వ్యయం ₹2.80లక్షల కోట్ల నుంచి ₹2.90లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.