నవతెలంగాణ – వాషింగ్టన్: వచ్చే నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే నేతల ప్రచారం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ప్రత్యక్ష చర్చకు సిద్ధమయ్యారు. నేడు జరగనున్న ‘డిబేట్’పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్ష పోరులో ఉన్న డెమోక్రటిక్ నేత బైడెన్, రిపబ్లికన్ నేత ట్రంప్.. నాలుగేళ్లలో తొలిసారి ముఖాముఖి తలపడనున్నారు. దీంతో వారు ఏయే అంశాలపై చర్చించనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.