రేపు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ-తొగుట
తెలంగాణ రాష్ట్ర ప్రదాత తెలంగాణ తల్లి సోనియాగాంధీ జన్మదినం ఘనంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ 60 ఏండ్ల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ జన్మదినం శనివారం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. మండల కేంద్రంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే పుట్టినరోజు వేడుకలలో మండల
పరిధిలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల,గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
Spread the love