ఇంజినీరింగ్‌ రెండోవిడతలో వెబ్‌ఆప్షన్ల నమోదుకు నేడే ఆఖరు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న రెండోవిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో వెబ్‌ఆప్షన్ల నమోదు గడువు గురువారంతో ముగియనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు 5,301 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఈనెల 31లోపు రెండోవిడత సీట్లు కేటాయింపు ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకు 38,318 మంది అభ్యర్థులు 14,66,391 వెబ్‌ఆప్షన్లు నమోదు చేశారని పేర్కొన్నారు. ఒక అభ్యర్థి అత్యధికంగా 672 ఆప్షన్లను ఇచ్చారని తెలిపారు. ఇంజినీరింగ్‌ రెండో విడతలో 30,125 సీట్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

Spread the love