నేడు ఆర్‌బీఐ సమీక్షా ముగింపు

వడ్డీ రేట్లు యథాతథం..!
ముంబయి : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా నేటితో ముగియనుంది. మూడు రోజుల పాటు సాగిన ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సమీక్షా నిర్ణయాలను వెల్లడించనున్నారు. దేశంలో టమాట ధరలు భారీగా పెరగడం, ఉల్లి, పప్పుల ధరలు ప్రమాధ ఘంటికలను మోగిస్తున్న వేళ ఆర్‌బీఐ సమీక్షా అత్యంత కీలకం కానుంది.

Spread the love