జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు.. రెండో విడత పోలింగ్‌ ప్రారంభం

నవతెలంగాణ – జమ్మూ కాశ్మీర్: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బడ్‌గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు బుధవారం పోలింగ్‌ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కశ్మీర్‌ చీఫ్‌ రవీందర్‌ రైనా, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు తారిఖ్‌ హమీద్‌ కర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Spread the love