నేడు ఇంగ్లండ్‌తో రెండో టీ20…

ind-eng-womenనవతెలంగాణ – ముంబై: తొలి పోరులో ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం పాలైన భారత మహిళల క్రికెట్‌ జట్టు.. శనివారం రెండో టీ20 బరిలో దిగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఇంగ్లిష్‌ జట్టు ఆధిక్యం దక్కించుకోగా.. సిరీస్‌ సమం చేయాలని హర్మన్‌ప్రీత్‌ బృందం తహతహలాడుతున్నది. గత మ్యాచ్‌లో బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో తప్పిదాలతో పరాజయం వైపు నిలిచిన టీమ్‌ఇండియా.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగాలని చూస్తుంటే.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ దక్కించుకోవాలని ఇంగ్లండ్‌ భావిస్తున్నది. కొత్తగా జట్టులోకి వచ్చిన స్పిన్నర్లు మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తుండగా.. సీనియర్‌ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్‌, దీప్తి శర్మ సమిష్టిగా సత్తాచాటితేనే జోరు మీదున్న ఇంగ్లండ్‌ను అడ్డుకోగలం.

Spread the love