నవతెలంగాణ- హైదరాబాద్: జింబాబ్వేతో 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో టీం ఇండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ లెక్క సరిచేసేందుకు భారత జట్టుకు ఈరోజు అవకాశం దక్కనుంది. సిరీస్‌లో రెండో మ్యాచ్ ఈరోజు సాయంత్రం 4.30కు ప్రారంభం కానుంది. నిన్నటి మ్యాచ్‌లో బౌలింగ్ బాగానే చేసినా బ్యాటింగ్, ఫీల్డింగ్ పరంగా భారత ప్రదర్శన ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఇండియా గెలవాల్సిందేనంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.