నేడు ఉమ్మడి కరీంనగర్ లో పర్యటించనున్న కేటీఆర్ ..

నవతెలంగాణ – హైదరాబాద్: నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ల పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఈ రోజు ఉదయం పదిన్నరకు కరీంనగర్ మానేరు వంతెనపై సర్వాయి పాపన్న జయంతి వేడుకలలో పాల్గొంటారు. అనంతరం బైపాస్ రోడ్ లోని వి కన్వెన్షన్ హాల్లో 11 గంటలకు చేనేత వారోత్సవాల సమావేశం ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 గంటల వరకు కేటీఆర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి.. పద్మనాయక మండపం లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల మానేరు కరకట్ట వద్ద పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన నూతన బోటును ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు సిరిసిల్ల బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన K కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు జిల్లా ఆస్పత్రిలో 40 KV రూప్ టాప్ సోలార్ ప్లాంట్, 130 అదనపు బెడ్స్, డే కేర్ సెంటర్ ను ప్రారంభిస్తారు.

Spread the love