నేడు డీసీసీబీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి పై  అవిశ్వాసం

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మహేందర్ రెడ్డి పై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం పై శుక్రవారం ఓటింగ్ నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు నల్లగొండ పట్టణంలోని సహకార కేంద్ర బ్యాంక్ జిల్లా కార్యాలయం ఆవరణలో ఓటింగ్ ను నిర్వహించినట్లు జిల్లా కో-ఆపరేటివ్ అధికారి కిరణ్ కుమార్ నవతెలంగాణ తో చెప్పారు. సహకార బ్యాంకులో మొత్తం 19 మంది డైరెక్టర్లు ఉండగా చైర్మన్ మహేందర్ రెడ్డి పై 14 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బి ఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ మహేందర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు ఎలాగైనా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.
Spread the love