నేడు, రేపు మహానాడ

– భారీ ఏర్పాట్లు
– తెలంగాణ ప్రతినిధులూ హాజరు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలుగుదేశం జాతీయ మహా నాడు చరిత్రలో నిలిచిపోయేలా ఈ ఏడాది ఆ పార్టీ ఏర్పాట్లు చేసింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి నాలుగు లైన్ల జాతీయ రహదారి చెంతనే శని, ఆదివారాల్లో ఈ మహనాడును అద్భుతంగా నిర్వహించేందుకు ఆ పార్టీనాయకత్వం సన్నాహాలు చేపట్టింది. తెలంగాణ నుంచి కూడా భారీస్థాయిలో మహా నాడు కు హాజరుకానున్నారు. ఆ పార్టీ అధినేత ఎన్‌. చంద్రబాబు నాయుడు తోపాటు తెలంగాణ అధ్యక్షులు కాసా ని జ్ఞానేశ్వర్‌ ఇప్పటికే రాజమండ్రికి చేరుకున్నారు. అదీగాక టిడిపి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శతజయంతి ముగింపు కార్యక్రమం కూడా ఈ మహానాడులో నే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యం లోనే ప్రతిష్టాత్మకంగా ఈ మహా నాడును చేపడుతున్నారు. గోదావరి జిల్లాలో టీడీపీని బలోపేతం కావడా నికి ఈ మహానాడు దోహదపడనుం దని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సంవత్సరంలో జరిగే ఈ మహనాడులో టీడీపీ తొలి మ్యానిఫేస్టోను రాజమండ్రి మహా నాడులో ప్రకటించే అవకాశాలు కనిపి స్తున్నాయి. రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌లో 2006 మే 27,28,29 తేదీల్లో మహానాడు నిర్వ హించారు. గత మహానాడు నిర్వహణ లో కీలక పాత్ర పోషించిన రాజ మ హేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి ఆ అనుభవంతో ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారని ఆపార్టీ నేతలు అంటున్నారు. 38 ఎకరాల విశాలమైన స్థలంలో ఆదివారం మహా నాడు సభ జరగనుంది. ఆరోజు 10 నుంచి 15 లక్షల మంది హాజరవు తారని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస్తున్నది. శనివారం భూ లోకమ్మ గుళ్ళు సమీపంలో టీడీపీ ప్రతినిధుల సభ సుమారు 15 వేల మందితో నిర్వ హిస్తున్నారు. అక్కడ అధునాతన సౌక ర్యాలతో హైదరాబాద్‌కు చెందిన కేకే ఈవెంట్‌ సంస్థ టెంట్లు ఏర్పాట్లు చేసిం ది.వర్షాన్ని, ఎండను తట్టుకునేలా రూ పొందించారు. రక్తదానం శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్‌, ప్రెస్‌ గ్యాలరీ, భోజ న హాళ్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. గోదావరి రుచులను, ఆతిథ్యాన్ని ఈ మహానాడులో రుచి చూపించనున్నా రు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అభిమానులు, నాయకులు తర లిరానుండగా రాజమహేంద్రవరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని హౌటళ్లు, కళ్యాణ మండపాలు, గెస్ట్‌ హౌస్‌లన్నీ పది రోజులు క్రితమే బుక్కైపోయాయి. ఇదిలా ఉండగా మహనాడు జరిగే ప్రదేశాలతో పాటు జాతీయ రహదారి పొడవునా భారీ ఫ్లెక్సీలను కటౌవుట్లను ఏర్పాటు చేశారు. అలాగే రాజ మహేం ద్రవరం నగరమంతా టీడీపీ జెండా లు రెపరెపలాడుతున్నాయి. .
పొలిట్‌బ్యూరో భేటి
శని, ఆదివారాల్లో జరగనున్న మహానాడు నేపథ్యంలో రాజమండ్రి సరోవర్‌ హౌటల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్ష తన జరిగిన పొలిట్‌ బ్యూరో సమా వేశంలో తెలంగాణ తెలుగుదేశం అధ్య క్షులు కాసాని జ్ఞానేశ్వర్‌, ఏపీ అధ్యక్షు లు ఎ.అచ్ఛెన్నాయుడుతో ఇతర పొలి ట్‌ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి రావుల చంద్ర శేఖర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌ గౌడ్‌ తది తరులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా మహానాడు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అందులో చేయాల్సిన తీర్మానాలపై చర్చించారు. రెండు తెలు గు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రజా సమస్య లు, పునర్వీభజన ఇబ్బందులు మహా నాడులో చర్చించే అవకాశం ఉంది.

Spread the love