నేటి సమాజానికి భగత్ సింగ్ ఆలోచనలు చాలా అవసరం

  • ఆయన భావజాలం ప్రతి విద్యార్థి యువకులు సమాజంలో తీసుకొని వెళ్ళాలి
  • పాఠశాల స్థాయిలోనే డ్రగ్స్ దొరకడం ఆందోళనకరం
  • డ్రగ్స్ లేని సమాజం కోసం పాటుపడాలి
  • ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాలు ముగింపు సభలో వక్తలు

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాసంస్థలలో విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ బారిన పడకుండా పటిష్టమైన చర్యలు ప్రభుత్వము తీసుకుంటుందని, అందుకు అవసరమైన కృషి నేను చేస్తానని ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ తెలిపారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) హైదరాబాద్ జిల్లా కమిటీలు ఆధ్వర్యంలో భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. భగత్ సింగ్ ఆశయాలు చాలా గొప్పవని ఆయన ఆలోచనలు విద్యార్థులు అనుసరిస్తూనే సమాజంలోని అంతరాల పోవడానికి కృషి చేయాలని తెలిపారు.భగత్ సింగ్ ,రాజు దేవ్,సుఖదేవుల వర్ధంతిని విద్యార్థుల్లోకి తీసుకెళ్లతున్న ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ లను ఆయన అభినందించారు. ఎన్ఎస్ యూఐ రాష్ర్ట అధ్యక్షుడిగా ఈ కార్యక్రమం నాకు ఒక స్ఫూర్తిని ఇచ్చిందని తెలిపారు.
నేటి సమాజ పోకడలకు దూరంగా దేశభక్తిని పెంచుకోవాలి: ప్రముఖ సినీ నటులు, మిమిక్రి కళాకారుడు శివారెడ్డి
యువత సోషల్ మీడియా కొన్ని సమాజాన్ని పక్కదోవ పట్టించే అంశాలపై కేంద్రీక రిస్తూ దీన్ని మోజులో పడి కుటుంబాన్ని దేశాన్ని గురించి ఆలోచించడం లేదని మన దేశం బాగుండాలంటే యువత ఆలోచనలు ముఖ్యమని దేశభక్తి యువత ఆలోచనలలో యువత సమాజంలోని అంతరాలు పోవడానికి పాటుపడాలని అన్నారు . డ్రగ్స్ గంజాయి ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ దేశం కోసం ఆలోచించాలని అన్నారు. నేను ఉన్న యువత పక్కదో పట్టే పోకడల గురించి కాకుండా దేశం కోసం ఆలోచించి భగత్ సింగ్ లాంటి యోధుల జీవితాల నుండి పూర్తి పొంది ముఖ్యభూమికలను పోషించాలని అన్నారు.


భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని సమస్యలపై పోరాడాలి: మధుసూదన్ రెడ్డి
యువకులు భగత్ సింగ్ లను ఆదర్శంగా తీసుకొని సమస్యలపై పోరాడాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అన్నారు. అనేక సమస్యలు వచ్చాయ ని వాటిని పరిష్కారం అనేక అంశాలు వాటి కోసం చదువు లు సరైన సౌకర్యాలు కోసం భగ త్సింగ్ నీ స్ఫూర్తిగా తీసుకొని పోరాడాలని వారి ఆలోచనలు వారు తెలిపారు. ఈ కృషి చేస్తున్న ఎస్ఎఫ్ఐ , డివైఎఫ్ ఐ పాత్ర ఆద్వితీయం అని కొనియాడారు. ప్రతి సంవత్సరము ఈ యువజన ఉత్సవాలు నిర్వహించి యువకులలో విద్యార్థులలో చైతన్య నింపాలని తెలిపారు.


చదివే కాదు సమాజాన్ని అధ్యయనం చేయాలి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు,అనగంటి వెంకటేష్
భగత్ సింగ్,రాజు గురు, సుఖుదేవ్ 93వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆలోచనలను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామని నేటి సమాజంలో భగత్సింగ్ ఆలోచన విధానం చాలా అవసరం అని తెలిపారు.భగత్ సింగ్ తన చిన్న తనం నుండే జాతీయోద్యమంలో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సమాజంలో కులం,మతం అంటరానితనం వంటి అంశాలపై చాలా స్పష్టంగా తన భావాలను ప్రకటించారని తెలిపారు. కేవలం చదువులకే పరిమితం కాకుండా సమాజంలోని అసమానతలు మత విభజనలు విద్వేషాలు, వివక్షతలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ అతన్ని సహచరుల స్ఫూర్తితో ఉద్యమించాలని వారు తెలిపారు.దేశంలో నేడు పాలిస్తున్న బిజెపి ప్రజలను విభజిస్తూ తన రెచ్చగొడుతూ ఓట్ల కోసం విభజన చేస్తూ దేశాన్ని మతం, మత ఉన్మాదం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అందుకే నేడు భగత్ సింగ్ ఆలోచనలు ముఖ్యమని అన్నారు. తాను నాస్తికుడని ప్రకటించుకొని భగత్ సింగ్ కులాన్ని మతాన్ని వదిలేశాడు.అని తెలిపారు.నేడు రాజకీయంగా ఓట్ల కోసం అవార్డులను ప్రకటిస్తున్నారని కానీ దేశం కోసం నిస్వార్ధంగా పోరాడి తన ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు.
         మార్చి 1వ తేదీ నుండి మార్చి 24వ తేదీ వరకు భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో మార్చి 1 నుండి విద్యాసంస్థలు బస్తీలలో ఆటల పోటీలు 2కె రన్, రక్తదాన శిబిరాలు , కవి,గాయక సమ్మేళనాలు , కల్చర్ పోటీలు, డ్రగ్స్ నివారణకై వ్యాసరచన సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించే కృషిని హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కమిటీలు చేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పాట పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ యువజన ఉత్సవాల ముగింపు సందర్భంగా తెలుగు యూనివర్సిటీలో భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాలు ముగింపు సభ జరిగింది. ఈ సభకు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శిలు అశోక్ రెడ్డి, ఎండి జావిద్ అధ్యక్షత వహించారు. వేదికపైకి అతిథులను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష లు లెనిన్ గువేరా ఆహ్వానించగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు హస్మి బాబు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పవిత్ర జిల్లా ఉపాధ్యక్షులు స్టాలిన్, వీరేందర్, కవిత నాయకులు అభిమన్యు, విగ్నేష్, చరణ్ శ్రీ, అజయ్ శివ గణేష్, దాసు, సాయి, శివ తదితరులు పాల్గొన్నారు.

Spread the love