ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు

నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ నిర్మాతల బృందం నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసింది. అల్లు అరవింద్, దిల్ రాజు, ఏఎం రత్నం, అశ్వినీదత్, యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, సురేశ్ బాబు, సుప్రియ, బన్నీ వాస్, ఎన్వీ ప్రసాద్, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ ఈ మధ్యాహ్నం విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికి క్యాబినెట్ సమావేశం ముగించుకుని వచ్చిన పవన్ కల్యాణ్… సినీ నిర్మాతలతో భేటీ అయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, ఏపీలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, టికెట్ రేట్ల పెంపు తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా పాల్గొన్నారు. పిఠాపురంలో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా పవన్ కల్యాణ్ ను నిర్మాతలు అభినందించారు. మంత్రిగానూ విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love