శాఖాహారులపై టమాటా దెబ్బ

Tomato attack on vegetarians–  ప్లేట్‌ ధర 24% ప్రియం : క్రిసిల్‌ రిపోర్ట్‌
న్యూఢిల్లీ : దేశంలో ఓ దశలో మూడంకెల స్థాయికి పెరిగిన కిలో టమాటా ధర శాఖాహారుల భోజనంపై తీవ్ర ప్రభావం చూపిందని రేటింగ్‌ ఎజెన్సీ క్రిసిల్‌ పేర్కొంది. 2022 ఆగస్ట్‌తో పోల్చితే గడిచిన నెలలో సగటు భారతీయ కుటుంబంలో శాఖాహారం థాలీ (ప్లేట్‌) ధర 24 శాతం పెరిగిందని క్రిసిల్‌ విడుదల చేసిన నెలవారీ రోటీ రైస్‌ రేట్‌ నివేదికలో తెలిపింది. 2023-24లో కూరగాయల భోజనం ధర పెరగడం ఇది రెండోసారని పేర్కొంది. 24 శాతంలో 21 శాతం టమాటా ధరనే కారణమని తెలిపింది. గతేడాది కిలో ధర రూ.37గా ఉండగా.. ఈ ఏడాది 176 శాతం ఎగిసి రూ.100పైకి ఎగబాకిందని పేర్కొంది. వెజ్‌ థాలీలో రోటీ, కూరగాయలు (ఉల్లిపాయలు, టొమాటో మరియు బంగాళదుంపలు), బియ్యం, పప్పు, పెరుగు, సలాడ్‌ ఉంటాయి. దీని సగటు ధర ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశంలో ఉన్న ధరల ఆధారంగా లెక్కించింది. గడిచిన నెలలో మాంసహార ప్లేట్‌ ధర 13 శాతం పెరిగింది. కాగా.. సెప్టెంబర్‌లో తగ్గుతోన్న టమాటా ధరల వల్ల ప్లేట్‌ భోజనం ధర దిగిరావొచ్చని క్రిసిల్‌ పేర్కొంది.

Spread the love