రేపు గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.అర్ రంగనాథ్ జన్మదిన వేడుకలు…

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
రంగారెడ్డి జిల్లా బడంగపేట లోని జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్ రంగనాథన్ పుట్టినరోజు పురస్కరించుకొని జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం నిర్వహిస్తున్నామని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ ముఖ్య గ్రంథపాలకులు ఏబీఎన్ రాజు తెలిపారు. గురువారం అఫ్జల్ గంజ్ లోని ఆయన చాంబర్లో ఈనెల 12వ తేదీన రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్ రంగనాథన్ పుట్టినరోజు వేడుకలకు రాష్ట్ర విద్యా శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, గ్రంధాలయాల పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ఆయాచితం శ్రీధర్. వివిధ జిల్లాల గ్రంథాలయాల అధ్యక్షులు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా పలువురి సన్మానిస్తున్నట్లు తెలిపారు.
Spread the love