టీజీటీ దరఖాస్తులకు రేపే తుది గడువు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌ సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 4,006 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీచర్‌) పోస్టుల దరఖాస్తుకు శ‌నివారంతో గడువు ముగియనుంది. గురుకులాల్లో అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న 9,210 పోస్టుల భర్తీకి గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు గత ఏప్రిల్ 17 నుంచి విడతలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో ఈనెల 24వ తేదీతో డీఎల్‌, జేఎల్‌, పీడీ, లైబ్రేరియన్‌, మ్యూజిక్‌, ఆర్ట్‌, క్రాఫ్ట్ ఉద్యోగాల‌కు సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది. మిగిలిన టీజీటీ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి కొనసాగుతుండగా ఆ గడువు శనివారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది.

Spread the love