– ఉదయం 9 గంటలకు ఆవిష్కరణ చేయనున్న కలెక్టర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఈనెల జూన్ 2 వ తేదీన అనగా ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఉదయం 9.00 గంటలకు జిల్లా కలెక్టరు కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టరు, మెజిస్ట్రేట్ హనుమంత్ కే జెండగే జాతీయ పతాకావిష్కరణ గావించి, పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. తొలుత ఉదయం 8.30 గంటలకు జిల్లా కలెక్టర్ భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. కలెక్టర్ కార్యాలయంలో దినోత్సవ వేడుకలకు కలెక్టర్ కార్యాలయం ను ముస్తాబు చేస్తున్నారు.