రేపు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. హస్తం పార్టీ 64 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు. ఈ మార్కు కంటే కాంగ్రెస్ మరో 4 సీట్లు ఎక్కువే గెలిచింది.  ఈ నేపథ్యంలో, రేపు తెలంగాణలో కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించేందుకు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకుంటున్నారు. ఈ రాత్రికి కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు ఉదయం గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది.

Spread the love