రేపు కాళోజీ జయంతి మహాసభ  కవి సమ్మేళనం

నవ తెలంగాణ – సిద్దిపేట 
ప్రజాకవి కాళోజీ జయంతి, తెలంగాణా భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని,  వెన్నెల సాహితీ సంగమం సిద్దిపేట ఆధ్వర్యంలో కాళోజీ జయంతి మహాసభ, కవి సమ్మేళనం 9న, సా.గం.6-00 లకు, సంజీవని పారా మెడికల్ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని వెన్నెల సాహితీ సంగమం అధ్యక్షులు వంగర నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ శివమ్ గార్డెన్ బాంక్విట్ హాల్ ప్రక్కన ఉన్న సంజీవని పారా మెడికల్ కళాశాలలో జరుగునని కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పర్కపెల్లి యాదగిరి పాల్గొన్నారు.
Spread the love