ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ ఉన్న ధనుష్ టాప్ 11 సినిమాలు

హ్యాపీ బర్త్ డే ధనుష్

నవతెలంగాణ హైదరాబాద్: ధనుష్ గా సుపరిచితుడైన వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా త్వరలో 40వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. తమిళ, హిందీ చిత్రపరిశ్రమల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్. ఆయనకేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, గేయరచయితగా, నేపధ్య గాయకుడిగా కూడా పనిచేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2002లో ధనుష్ తన సోదరుడు కె.సెల్వరాఘవన్దర్శకత్వం వహించిన తుల్లువధో ఇలమైఅనే టీనేజ్ డ్రామాతో వెండితెర అరంగేట్రం చేశారు. అప్పటి నుండిఈ నటుడు పుదు పెటై, తిరువిలైయదళ్ ఆరంభం, కాదల్ కొండేన్, అసురన్, ఆడుకలం వంటి అనేక బాక్సాఫీస్ విజయాలలో ప్రధాన పాత్రలలో నటించాడు. ఆడుకలం, అసురన్ సినిమాల్లోని నటనకు వరుసగా 58, 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అవార్డులు లభించాయి. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన రాంజానా చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ నటుడు ఈ ఏడాది ప్రారంభంలో దీనికి సీక్వెల్ ప్రకటించారు.

ధనుష్ టాప్ 11 సినిమాలు
ధనుష్ టాప్ 11 సినిమాలు

 

Spread the love