హైదరాబాద్: సాహిత్యలోకానికి చిరపరిచితుడు, సీనియర్ జర్నలిస్టు తోపుడుబండి సాధిక్ అలీ గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన సాధిక్ సుదీర్ఘకాలం జర్నలిస్టుగా పనిచేశారు. తోపుడుబండిలో పుస్తకాలను అమ్మడంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పుస్తక జ్ఞానాన్ని తోపుడు బండిపై ప్రతి ఒక్కరికి అందించారు. ఆ విధంగా తోపుడుబండి సాధిక్ అలీగా పేరు తెచ్చుకున్నారు. అందరితోనూ కలివిడిగా, సాహిత్యజీవిగా సంచరిస్తూ ఎంతో ఉత్సాహాన్ని నింపేవారు. వేలాది మంది పేద పిల్లల చదువులకు భరోసా కల్పించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. సాధిక్ అలీ మరణం పట్ల పలువురు సాహితీ వేత్తలు నివాళులర్పించారు. తెలంగాణ బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్, తెలంగాణ సాహితీ అధ్యక్ష, కార్యదర్శులు వల్లభాపురం జనార్థన, కె.ఆనందాచారి సంతాపాన్ని ప్రకటించారు.