చిరిగిన జాతీయ జెండా.. ట్వీట్‌తో అప్రమత్తం

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్‌)లోని భారీ పోల్‌పై ఏర్పాటు చేసిన జాతీయ జెండా గాలికి చిరిగింది. దీన్ని ఓ యువకుడు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో శుక్రవారం పోస్టు చేశాడు. కొందరు ప్రముఖులకు ట్వీట్‌ చేయడంతో హైదరాబాద్‌లో ఉన్న కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ వరకు విషయం చేరింది. వెంటనే ఆయన కలెక్టరేట్‌ పాలన అధికారి కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఆగమేఘాలపై వారు కొత్తజెండాను తీసుకొచ్చి, క్రేన్‌ సహాయంతో అమర్చారు.

Spread the love