నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్, నిజాంపేట, మాదాపూర్, ప్రగతి నర్, పటాన్ చెరు, కొత్తగూడ, గచ్చిబౌళి, సికింద్రాబాద్, ముషీరాబాద్, రాంనగర్, వారాసిగూడ, అడిక్‌మెట్, జీడిమెట్ల, ప్యారడైజ్, బేగంపేట, తార్నాక, హబ్సిగూడ, నాగోలు, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా పలు కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. గురు, శుక్రవారాలు కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.