నవతెలంగాణ – హైదరాబాద్ : వికారాబాద్(D) నవల్గాకు చెందిన నరేశ్(17), ఓ బాలిక(16) ప్రేమించుకుని మే 2న ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో అతనిపై జహీరాబాద్ పోలీస్స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. అయితే బాలుడి ఆచూకీ చెప్పాలంటూ తనను 3 నెలలుగా పోలీసులు చిత్ర హింసలు పెడుతున్నారని, దెబ్బలకు చేతులు, కాళ్లు వాచిపోయాయని తల్లి కళావతి వాపోతున్నారు. పోలీసులు కొట్టిన విషయం తమ దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేస్తామని CI అశోక్ తెలిపారు.