సంపూర్ణ సురక్ష హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన

నవతెలంగాణ-దేవరకొండ
సంపూర్ణ సురక్ష హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ అవగాహన కార్యక్రమాలను స ద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్‌ రవీంద్ర కుమార్‌ కోరారు. గురువారం దేవరకొండ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌, గ్రీన్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ అవగాహన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సమస్త చేపట్టిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ఎమ్మెల్యే ర్యాలీనీ ప్రారంభించి మాట్లాడారు. సంపూర్ణ సురక్షితం కాదు అనుకుంటే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసిటిసి కేంద్రంలో హెచ్‌ఐవి పరీక్షల ఉచితంగా చేయించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో ఇది కూడా ఒకటని తెలిపారు. ప్రతి గ్రామన అవగాహన కార్యక్రమాలు,హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌వీటీ, ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్‌గౌడ్‌, కోశాధికారి కృష్ణ కిషోర్‌, లీగల్‌ అడ్వైజర్‌ ఉమా మహేష్‌, బొడ్డుపల్లి కృష్ణ, కౌన్సిలర్స్‌ ముడవత్‌ జయప్రకాష్‌, తౌఫిక్‌ ఖాద్రీ, ఇలియాస్‌, భాస్కర్‌రెడ్డి, ప్రసన్న, తాళ్ల సురేష్‌, రాక్‌ స్టార్‌ రమేష్‌, కరాటే మాస్టర్‌ శ్రీను, ఖాజా, శ్రీను, డాన్స్‌ మాస్టర్‌ జగన్‌, హోటల్‌ అసోసియేషన్‌ సభ్యులు జీ.యాదయ్య, టీ.శ్రీను, కొండల్‌, తిరుపతయ్య, గ్రీన్‌ క్రాస్‌ సొసైటీ సిబ్బంది సంజీవ్‌ కుమార్‌, సిరిచందన, గౌరీ, బలరామ్‌, రవి, లలిత తదితరులు పాల్గొన్నారు.

Spread the love