జకోవిచ్‌కు కఠిన డ్రా!

A tough draw for Djokovic!– క్వార్టర్స్‌లోనే అల్కరాజ్‌తో ఢీ
మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా): ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పది సార్లు చాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా)కు కఠిన డ్రా ఎదురైంది. మెన్స్‌ సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోనే మూడో సీడ్‌ కార్లోస్‌ అల్కరాజ్‌తో తలపడే అవకాశం ఉంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ జానిక్‌ సినర్‌ క్వార్టర్స్‌లో డీ మిన్యూర్‌ను ఎదుర్కొనే వీలుంది. మహిళల సింగిల్స్‌లో వరల్డ్‌ నం.1 సబలెంక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో హ్యాట్రిక్‌పై కన్నేసి బరిలోకి దిగుతోంది. మార్టినా హింగిస్‌ తర్వాత వరుసగా మూడు సార్లు గ్రాండ్‌స్లామ్స్‌ సాధించిన రికార్డు సాధించేందుకు సబలెంక ఎదురుచూస్తోంది. కొకొ గాఫ్‌, నవొమి ఒసాక, ఇగా స్వైటెక్‌, ఎమ్మా రాడుకానులు మహిళల సింగిల్స్‌ టైటిల్‌ రేసులో నిలిచారు.

Spread the love