పర్యాటకం విజ్ఞానదాయకం

పర్యాటకం విజ్ఞానదాయకంప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాముఖ్యతను పెంపొందించడం. పర్యాటకం ఒక దేశం లేదా ప్రాంత ఆర్థిక విలువలను మాత్రమే కాకుండా దేశంలోని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విలువలను ఎలా ప్రభావితం చేస్తుందో సాధారణ ప్రజలకు చూపించడం.
పర్యటనకు వెళ్ళడం అంటే అందరకూ సంతోషమే. ఎందుకంటే ఎప్పుడూ ఒకే ప్రదేశంలో ఉంటాం కనుక మన మనసు ఇతర ప్రదేశాల ఆనందాలు, జీవన శైలి కూడా కోరుకొంటుంది. ”ప్రయాణం, అది మిమ్మల్ని మాట్లాడకుండా చేస్తుంది. ఆపై మిమ్మల్ని కథకుడిగా మారుస్తుంది” అంటారు ప్రసిద్ధ చారిత్రక పర్యాటకుడు ఇబ్న్‌ బటూటా. కొత్త దేశం, రాష్ట్రం, ప్రాంతం, ఊరు, సరికొత్త వాతావరణం, కొంగొత్త అనుభవాలు.. వీటిని మది నిండా దాచుకోవడం అవసరమే. బ్యాగ్‌ సర్దుకుని విహారానికి వెళ్తే మనసుకు, శరీరానికి ఎంతో ప్రశాంత. అందుకే చాలా మంది సెలవుల్లో ఏదో ఓ టూర్‌ ప్లాన్‌ చేసుకుంటారు. ప్రపంచపు మరో కోణాన్ని కండ్ల కెమెరాతో క్లిక్‌ చేసి మనసు మెమొరీలో దాచుకుంటారు. కుటుంబ సభ్యులు, మిత్రులతో లేదా ఒంటరిగానైనా ప్రపంచాన్ని చూడడానికి మించిన పెద్ద చదువు ఇంకేం ఉంటుంది. విహార యాత్రకు వెళ్లేటప్పుడు వచ్చే చల్లగాలిని ఆస్వాదించడాన్ని మించిన ఆనందం ఉంటుందా…
పర్యాటకం ప్రాముఖ్యత, దేశం లేదా ఏదైనా ప్రాంత ఆర్థిక వృద్ధికి అది ఎలా సహాయపడుతుందనే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సెప్టెంబర్‌ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకుంటారు. దీన్ని యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ (ఖచీఔుఉ) ప్రారంభించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, దాని ప్రాముఖ్యతను అర్థం చేయించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని అన్వేషించడంలోని ఆనందాన్ని ప్రజలకు అర్థం చేయడమే ప్రపంచ పర్యాటక దినోత్సవం లక్ష్యం.
ప్రపంచ పర్యాటక దినోత్సవ చరిత్ర
ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ ట్రావెల్‌ ఆర్గనైజేషన్‌ (×ఖఉుఉ) ద్వారా 27 సెప్టెంబర్‌, 1970న మెక్సికో సిటీలో ఒక ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించబడింది. ప్రపంచ పర్యాటక సంస్థ యొక్క చట్టాలను ఆమోదించింది. అప్పుడు, ఖచీఔుఉ సెప్టెంబర్‌ 1979 చివరిలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని స్థాపించాలని నిర్ణయించింది. మొదటిసారి 1980, 27 సెప్టెంబర్‌న ఈ రోజు జరుపుకున్నారు. అప్పటి నుండి విభిన్న థీమ్‌లతో ప్రతి ఏడాది ఈ రోజును ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ ఏడాది టూరిజం, గ్రీన్‌ ఇన్వెస్టిమెంట్‌ థీమ్‌తో ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుగుతుంది.
ప్రాముఖ్యత
ఈ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాముఖ్యతను పెంపొందించడం. పర్యాటకం ఒక దేశం లేదా ప్రాంత ఆర్థిక విలువలను మాత్రమే కాకుండా దేశంలోని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విలువలను ఎలా ప్రభావితం చేస్తుందో సాధారణ ప్రజలకు చూపించడం. 1997లో టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవంలో ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఏడాది ఒక్కో దేశంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది.
మన దేశంలో కూడా…
ప్రపంచ పర్యాటక దినోత్సవం 2019 వేడుకలు భారతదేశంలోని ఢిల్లీలో జరిగాయి. మొదటిసారి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని మన దేశంలో నిర్వహించారు. భారతదేశం వైవిధ్యానికి ప్రసిద్ధి. కాబట్టి ఇది పర్యాటకులకు వివిధ వంటకాలు, సాహసోపేత ప్రదేశాలు, చరిత్ర, సంగీత రూపాలు, భాషలు మొదలైనవాటిని అందించగలిగింది. ఖచీఔుఉ పర్యాటకం, సాంకేతికతల ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. ఇది ఆవిష్కరణలకు, భవిష్యత్‌ ఉద్యోగాలను సృష్టించే అవకాశాలను అందించింది. మన వారసత్వ ప్రాముఖ్యతను గురించి ప్రజలకు బోధించేలా చేయడం ద్వారా మన వారసత్వం, సంస్కృతిని రక్షించవచ్చు.
ప్రధాన ఆదాయ వనరు
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అనేక రకాలుగా జరుపుకుంటారు. ఈ రోజున వినోద ఉద్యానవనాలు, మ్యూజియంలు, ఇతర సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేస్తారు. అలాగే పర్యాటకులను ఆకర్షించడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉచిత ప్రవేశం లేదా టిక్కెట్ల ధరలను తగ్గిస్తుంటారు. అంతిమంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా వివిధ కార్యక్రమాలు రూపొందించబడతాయి. అన్నింటికంటే ముఖ్యంగా పర్యాటక రంగం ప్రపంచవ్యాప్తంగా నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగంగా మారింది. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది ప్రధాన ఆదాయ వనరు. అందుకే ప్రభుత్వాలు కూడా పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇది అపారమైన సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని చూపింది. అట్టడుగున ఉన్న సమూహాలు అన్నింటికంటే ఎక్కువగా దెబ్బతింటాయి. ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమ స్థాయికి తగినట్టు ఆర్థిక మనుగడ కోసం పర్యాటకంపై ఆధారపడి ఉంటాయి. వారి సాంస్కృతిక, సామాజిక, రాజకీయ విలువలను హైలైట్‌ చేస్తాయి. పర్యాటకం, స్థిరమైన అభివృద్ధి గురించి అవగాహన పెంచడానికి ఇది ఏకైక అవకాశం.
 2022 – టూరిజం పునరాలోచన: మరింత సుస్థిరమైన, సమగ్రమైన, స్థితిస్థాపకమైన పరిశ్రమను సృష్టించేందుకు ఆ ఏడాది అధికారిక వేడుకలకు ఇండోనేషియా హోస్ట్‌ దేశంగా నిలిచింది.
 2021 – సమగ్ర వృద్ధి కోసం పర్యాటకం: ఈ ఏడాది టూరిజం ఫర్‌ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌పై దృష్టి పెట్టింది.
 2019 – పర్యాటకం – ఉద్యోగాలు: అందరికీ మంచి భవిష్యత్తు. ఇది ముఖ్యంగా యువత, మహిళలకు మరింత మెరుగైన ఉద్యోగాలను సృష్టించడంపై దృష్టి పెట్టింది. పనికి అవకాశం కల్పించడం అనేది సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్‌ 8లో కూడా పేర్కొనబడింది. సాంకేతికతలో కొనసాగుతున్న పురోగతిని ప్రతిబింబించేలా, వాటిని పొందుపరిచేలా కొత్త విధానాలు రూపొందించాలి. ఐక్యరాజ్యసమితి మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌లో వివరించిన సవాళ్లపై దృష్టిని ఆకర్షించడానికి, సవాళ్లను ఎదుర్కోవటానికి పర్యాటక పరిశ్రమ ఎలా సహాయపడుతుందనే దానిపై దృష్టి పెట్టి ఈ కార్యక్రమం భారతదేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ప్రధాన పాత్ర
వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ (ఖచీఔుఉ) ప్రకారం డిజిటల్‌ పురోగతి, ఆవిష్కరణలు మరింత స్థిరమైన, బాధ్యతాయుతమైన పర్యాటక రంగంతో నిరంతర వృద్ధిని నెరవేర్చే సవాలుకు పరిష్కారంలో ఈ రోజు ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ వారసత్వాన్ని రక్షించడంలో అవసరమైన సాధనాలు, ప్రజాభిప్రాయ మద్దతును అందించడం, సాంస్కృతిక జ్ఞానం, అవగాహనను ప్రోత్సహించడంలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవ ప్రధాన పాత్ర పర్యాటకం యొక్క ప్రపంచ ప్రాముఖ్యతను హైలైట్‌ చేయడం. యూరోపియన్‌ కౌన్సిల్‌ ఆన్‌ టూరిజం అండ్‌ ట్రేడ్‌ ప్రకారం పర్యాటకం ప్రపంచంలోనే గొప్ప విద్యావేత్త.
(సెప్టెంబర్‌ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం)
– సలీమ
94900 99083న

Spread the love