ముత్యందార జలపాతంలో చిక్కుకున్న పర్యాటకులు సేఫ్..

నవతెలంగాణ-హైదరాబాద్ : ములుగు జిల్లా ముత్యాల ధార వాటర్ ఫాల్స్ సందర్శనార్థం వెళ్లి అడవిలో చిక్కుకున్న 82 మంది పర్యాటకులు సేఫ్ అయ్యారు. పర్యాటకులను అడవి నుంచి ఇవాళ ఉదయం 3:30 ప్రాంతంలో సురక్షితంగా కాపాడి తీసుకొచ్చింది ఎన్డీఆర్ఎఫ్, జిల్లా పోలీసు యంత్రాంగం. ములుగు జిల్లా వీరభద్రవరం ముత్యం దార జలపాతానికి వెళ్లి జజ్జల వాగు వద్ద నిన్న చిక్కుకు పోయారు పర్యాటకులు. అయితే…. ఏకంగా 82 మంది పర్యాటకులు రక్షించింది ఎన్డీఆర్ఎఫ్, జిల్లా పోలీసు యంత్రాంగం. అర్ధరాత్రి మూడు గంటల సమయం దాకా సాగింది రిస్కు ఆపరేషన్. ఇందులో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా గ్రామానికి చేరుకున్నారు పర్యాటకులు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Spread the love